అందుకే చరణ్ మనసు మారిందా.?

ఇప్పుడు మన టాలీవుడ్ లో ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాత్రమే ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు అనౌన్స్ చెయ్యలేదు. దీనితో ప్రస్తుతానికి చరణ్ రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ వండర్ మరియు కొరటాలతో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో తీస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం “ఆచార్య”లో నటించనున్నారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోవడం మళ్ళీ పునః ప్రారంభం కావడం జరిగింది.

కానీ మొదట్లో మాత్రం చరణ్ RRR లో షూటింగ్ లో హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు అందరూ షూటింగ్స్ కోసం ముందుకొస్తుంటే చరణ్ కూడా కెమెరా ముందుకు వచ్చేందుకు సన్నద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాను కూడా ఒక మెయిన్ లీడ్ లో నటిస్తున్న RRR కాదని ఆచార్య లోనే ముందు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఎందుకంటే రాజమౌళి సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ కాబట్టి ఎక్కువ రోజులు షూట్ చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఆచార్య లో జస్ట్ గెస్ట్ రోల్ కనుక తక్కువ సమయంలో అయ్యిపోతుంది కాబట్టి ఒకప్పుడు RRR కే ఎక్కువ సమయాన్ని కేటాయించినా ఇప్పుడు మాత్రం మనసు మార్చుకొని ఆచార్య లోనే ముందు పాల్గొని ఆ తర్వాత ఆ చిత్రంలో పాల్గొనాలని ఫిక్స్ అయ్యారట. మరి ఏఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

Exit mobile version