పనిలో పని ప్రభాస్ ఈ ప్రకటన కూడా చేసెయ్యనున్నాడా?


డార్లింగ్ హీరో ప్రభాస్ ఎప్పుడైతే బాహుబలి చిత్రం మొదలు పెట్టాడో అక్కడ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అతని సినిమాలకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అనే మాటనే మర్చిపోయారు. అక్కడ నుంచి “సాహో”, “రాధే శ్యామ్” వరకు అదే పంథా కొనసాగడంతో వారు ఏదన్నా అప్డేట్ కోసం ఎదురు చూడని రోజంటూ లేదు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రభాస్ నుంచి వస్తున్న అప్డేట్ల ప్రవాహంతో డార్లింగ్ అభిమానులు తబ్బిబ్బవుతున్నారు.

అలా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మూడు భారీ ప్రాజెక్టులకు సంబంధించి అనౌన్స్మెంట్ లు చేసేసి ప్రభాస్ తన అప్ కమింగ్ ప్రాజెక్టులను లాక్ చేసేసాడు. అయితే ఈ మధ్య కాలంలోనే ప్రభాస్ మరో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక ప్రాజెక్ట్ చేయనున్నాడని విపరీతమైన బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేసేసే అవకాశాలు కూడా లేకపోలేవని తెలుస్తుంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్పుడు అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.

Exit mobile version