సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో బాలయ్య నెక్స్ట్..?

వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ తో జోరుమీదున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన గత రెండు చిత్రాలైన ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు భారీ విజయాలు అందుకున్నాయి. కాగా కొంత కాలంగా అని కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఆయన తన రైటింగ్ టీమ్ తో కలిసి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఆ మూవీని 2021 సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు.

కాగా ఇదే సమయంలో నటసింహం బాలయ్య కోసం ఆయన ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అనిల్ నెక్స్ట్ మూవీ బాలయ్యతోనే చేసే అవకాశం కలదని అంటున్నారు.గతంలో కూడా బాలయ్యతో మూవీ చేయాలని అనిల్ చెప్పిన నేపథ్యంలో ఈ వార్తలకు బలం చేకూర్చుతుంది ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. దీనితో బాలయ్య నెక్స్ట్ అనిల్ రావిపూడితో చేయాలని కోరుకుంటున్నారు.

Exit mobile version