పవన్ ఫ్యాన్సూ గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారే.!

మన స్టార్ హీరోల అభిమానులు ఇప్పుడు తమ అభిమాన హీరోల పుట్టిన రోజు వేడుకలను వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్ లైన్ సంబరాలు పెద్దగా లేకపోవడంతో ఆన్ లైన్ లోనే తారా స్థాయిలో చేస్తున్నారు. పుట్టినరోజు కన్నా ముందే అడ్వాన్స్ బర్త్ డే విషెస్ మరియు కామన్ డీపీ అంటూ రకరకాల ట్రెండ్స్ తో ట్విట్టర్ లో దుమ్ము రేపుతున్నారు.

అలా ఇటీవలే తారక్ ఫ్యాన్స్ సెట్ చేసిన రికార్డ్స్ ఫ్యాన్స్ బ్రేక్ చెయ్యగా దానిని సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ బ్రేక్ చేసారు. ఇక మళ్ళీ ఆ 3 కోట్ల 70 లక్షల ట్వీట్స్ టార్గెట్ ను పవన్ ఫ్యాన్స్ తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా గట్టిగానే ప్లాన్ చేసారని చెప్పాలి. వారి ట్రెండ్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అలెర్ట్ చేస్తూ రిలీజ్ చేసిన ఓ వీడియో మోస్ట్ పవర్ ఫుల్ గా డిజైన్ చేసారు. . ఈ ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కామన్ డీపీ ను విడుదల చేసి ట్రెండ్ లో పాల్గొననున్నారు. మరి మహేష్ ఫ్యాన్స్ సెట్ చేసిన రికార్డును బ్రేక్ చేసి వీరెంత టార్గెట్ సెట్ చేస్తారో చూడాలి.

Exit mobile version