మార్పు మన ఇంటినుండే మొదలవ్వాలి- మహేష్

నేడు ప్రపంచ సహజ వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ మహేష్ ఓ సామాజిక సందేశం పంచుకున్నారు. మహేష్ ట్విట్టర్ ద్వారా సహజ వనరులను కాపాడుకోవడం మరియు వినియోగం వంటి విషయాలలో పాటించవలసిన జాగ్రత్తలు, ఆవశ్యకత తెలియజేశారు. నీటిని సేవ్ చేయాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, వేస్ట్ మేనేజ్మెంట్ పై ద్రుష్టి సారించాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ మార్పు మన ఇంటినుందే మొదలుకావాలని మహేష్ కోరుకున్నారు.

కాగా మహేష్ తన నెక్స్ట్ మూవీ షూట్ కోసం సిద్ధం అవుతున్నారు. దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్న సర్కారు వారి పాట మూవీ షూట్ సెప్టెంబర్ లో మొదలుపెట్టాలనేది చిత్ర యూనిట్ ఆలోచన. మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఎంటరైన్మెంట్స్ మరియు జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version