కరోనా ఆందోళనలో సినీ పరిశ్రమలు !

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం అల్లాడిపోతోంది. ఇప్పటికే కరోనా వైరస్ సినీ పరిశ్రమలను అయోమయంలో పడేసింది. ఈ వైరస్ కారణంగా షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు షూట్ ను వాయిదా వేసుకున్నాయి. అయితే అక్టోబర్ మొదటి తేదీ వరకూ షూటింగ్స్ వాయిదా వేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు అది ఇంకా పొడిగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రోజురోజుకూ కరోనా తీవ్రత పెరుగుతుండటంతో సామాజిక దూరంను పాటిస్తూ చిన్న సినిమాల షూటింగ్ లను కూడా జరపలేని పొజిషన్. మరి ఈ కరోనా అక్టోబర్ లోపు అదుపులోకి రాకపోతే నిర్మాతలకు భారీగా నష్టం తప్పదు.

మరోపక్క సినిమాల విడుదల తేదీలు కూడా కరోనా దెబ్బకు గందరగోళంగా మారాయి. ఇక రెండు స్టేట్స్ లోని థియేటర్లు మూసి వేయడంతో.. థియేటర్స్ కార్మికులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారు. థియేటర్స్ ఓపెనింగ్ ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవటం తప్ప, ప్రస్తుతం ఎవ్వరూ చేయగలిగింది ఏమి లేదు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి మరియు సామాజిక దూరం పాటిస్తూన్న ఏదొక రూపంలో కరోనా దాడి చేస్తోన్న సంఘటనలు కనిపిస్తుండటం దురదృష్టకరం. మొత్తానికి సినీ పరిశ్రమలకు కరోనా ఆందోళన కలిగిస్తోంది.

Exit mobile version