సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబందించి ఒక అప్ డేట్ తెలిసింది. కరోనా కారణంగా ‘పవన్ – క్రిష్’ సినిమాలో ఒక పెద్ద మార్పు చేశారట. మొదట ఈ సినిమా క్లైమాక్స్ ను మొరాకోలో భారీ సెట్లలో భారీ స్థాయిలో షూట్ చేయాలని క్రిష్ భారీగా ప్లాన్ చేసుకునప్పటికీ.. కరోనా దెబ్బకు ఇప్పుడు ఆ ప్లాన్ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అందుకే మొరాకో ఎపిసోడ్ ను హైదరాబాద్‌లోనే భారీ సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేయాలని నిర్ణయించారు.
కాగా ఈ పిరియాడిక్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా.. అలాగే సినిమాలో యువరాణిగా నటించబోతుందని తెలుస్తోంది. అంటే ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు ఫ్యాన్స్ లో సినిమా పై ఆసక్తిని బాగా పెంచుతున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ భారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.