పవర్ స్టార్ మూవీపై చెలరేగిన వివాదం రీత్యా సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. దీనితో ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో ఈ సినిమాను చాలా మంది చూశారు. దీనితో వర్మకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఐతే వర్మ ఆదాయానికి పైరసీ గండి కొట్టింది. విడుదలైన గంటల వ్యవధిలో ఈ మూవీ పైరసీ వీడియోలు బయటికి రావడం జరిగింది. దీనితో సోషల్ మీడియాలో మరియు పైరసీ సైట్స్ లో పవర్ స్టార్ మూవీని ఫ్రీగా పేక్షకులు చూసేశారు.
ఐతే అప్పటికే వర్మ తన పెట్టుబడి లాభం రాబట్టుకున్నట్లు సమాచారం. అలాగే ఇది ఏ టి టి కాబట్టి భవిష్యత్తులో ఎవరు, ఎప్పుడు చూసినా..వర్మకు డబ్బులు వస్తాయి . ఇక ఆర్ జి వి మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ మూవీతో వర్మ నటుడిగా మారడంతో పాటు క్లైమాక్స్ లో సుదీర్ఘమైన స్పీచ్ తో రెచ్చిపోయాడు.