మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ఓ అరుదైన విషయాన్ని పంచుకున్నారు. ఆయనకు హీరో బాలకృష్ణ కరోనా వైరస్ సోకకుండా కాపాడే మెడిసిన్ అందజేశారట. బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ లో రోగులకు కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ పంచారట. అలాగే 24 క్రాఫ్ట్స్ లోని అందరు సాంకేతిక నిపుణలకు బాల్లయ్య వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందరితో పాటు వి వి వినాయక్ కి కూడా ఆయన ప్రత్యేకంగా పంపించారట. ఈ విషయాన్ని చెప్పి వి వి వినాయక్ సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో చెన్నకేశవ రెడ్డి అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఆ మూవీ విడుదలై దాదాపు 18ఏళ్ళు అవుతుంది. కానీ వివి వినాయక్ బాలయ్యతో మళ్ళీ మూవీ చేయలేదు. ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వివి వినాయక్ తన రెండవ చిత్రం చెన్నకేశవ రెడ్డితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.