యాక్షన్ హీరో ఫ్యామిలీలో కరోనా.. !

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సెలబ్రెటీలను కూడా వదిలిపెట్టకుండా వర్గభేదాలను కూడా చూడకుండా అది అందర్నీ కమ్మేస్తోంది. తాజాగా యాక్షన్ హీరో విశాల్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ సోకింది. విశాల్ తండ్రితో పాటు విశాల్ కి ఆలాగే అతని మేనేజర్ కి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అలాగే స్టార్ హీరో అర్జున్ కుమార్తె నటి ఐశ్వర్య అర్జున్ కి కూడా కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏమైనా దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజల పై తన ప్రభావాన్ని చూపిస్తోంది.

ఎంతో జాగ్రత్తగా ఉంటూ కరోనా పై పూర్తీ అవగాహన ఉన్న ప్రముఖులకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏమైనా కరోనాతో జీవితాల్లో చాల. మార్పులు రానున్నాయి.

Exit mobile version