‘వకీల్ సాబ్’ షూట్ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కరోనా మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి పూర్తయ్యేది. కానీ, లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక రోజురోజుకు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో షూటింగ్స్ స్టార్ట్ అయ్యేలా కనబడటం లేదు. అయితే అక్టోబర్ నుండి తమ సినిమాల షూట్ ను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు కొంతమంది మేకర్స్. కానీ పవన్ మాత్రం కరోనా తగ్గేవరకూ షూటింగ్ వద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది.

దిల్‌ రాజు ‘వ‌కీల్‌ సాబ్‌’ బ్యాలెన్స్ పార్ట్ ను పూర్తి చేయాల‌నే ఉద్దేశ్యంతో ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ ను అక్టోబర్ లో డేట్స్ ఇవ్వాల్సిందిగా కోరారని.. అయితే పవన్ మాత్రం కరోనా తగ్గాకే షూటింగ్ పెట్టుకుందామని చెప్పారట. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సామాజిక సందేశం ఉన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు. అన్నట్టు ప్రెజెంట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

Exit mobile version