లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ బాలీవుడ్ మాఫియాపై ధ్వజమెత్తారు. ఆయన బాలీవుడ్ లో తనపై కుట్ర జరుగుతుంది అన్నారు. కొందరు పని కట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. కొన్ని అవకాశాలు నా వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. సుశాంత్ సింగ్ మరణం నేపథ్యంలో అనేక మంది బాలీవుడ్ లో కొనసాగుతున్న నేపోటిజం మరియు మాఫియా పై తీవ్ర విమర్శలు చేయగా, తాజాగా ఆ లిస్ట్ లో ఏ ఆర్ రెహ్మాన్ చేరారు.
రెహ్మన్ సినిమాకు స్వరాలు త్వరగా ఇవ్వరని, ఆయన వద్దకు వెళ్ళకండి అని చాలా మంది దర్శక నిర్మాతలను ఆపేస్తున్నారట. దిల్ బేచారా డైరెక్టర్ ముఖేష్ చాబ్రా ని సైతం మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్ ని తీసుకోకండి అని చెప్పారని ఆయన స్వయంగా చెప్పడంతో రెహ్మాన్ ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. దిల్ బేచారా మూవీకి ఆయన ఇచ్చిన ట్యూన్స్ కి అద్భుత రెస్పాన్స్ దక్కింది.