దివంత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన చివరి చిత్రంతో రికార్డులు నెలకొల్పోతున్నారు. దిల్ బేచారా ట్రైలర్ తోనే అత్యధిక వ్యూస్ అండ్ లైక్స్ దక్కించుకున్న సుశాంత్ ఇండియా వైడ్ రికార్డు కొట్టారు. ఇక నేడు విడుదలైన దిల్ బేచారా చిత్రం మరో అరుదైన రికార్డు అందుకొంది. ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఎంబీడీలో అత్యధిక ఓట్లు దక్కించుకున్న చిత్రంగా దిల్ బేచారా రికార్డు కొట్టింది. అలాగే అత్యధిక రేటింగ్ దక్కించుకున్న చిత్రంగా కూడా దిల్ బేచారా నిలవడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ సినిమాకు 21 వేలకు పైగా ఓట్లు నమోదు అవ్వడంతో పాటు 9.8 రేటింగ్ ను నెటిజన్స్ ఇచ్చారు.
దిల్ బేచారా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇన్ని ఓట్లు మరియు ఇంత రేటింగ్ రావడం రికార్డుగా చెప్పుకోవచ్చు. భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రాలేదంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముకేశ్ చబ్రా దర్శకత్వంలో వచ్చిన దిల్ బేచారా మూవీ సుశాంత్ సింగ్ నటించిన చివరి చిత్రం. తమ అభిమాన హీరో ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు దిల్ బేచారా చిత్రంపై తమ ప్రేమ కురిపిస్తున్నారు.