భర్తకి తనదగ్గరే ఉద్యోగం ఇచ్చిన స్టార్ హీరోయిన్

మంచి నటిగా పేరున్న ప్రియమణి పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన చేసిన ఆమె సౌత్ లో కొన్నాళ్లుగా క్రేజీ హీరోయిన్ గా కొనసాగారు. ప్రస్తుతం ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. తెలుగులో విరాట పర్వం మూవీలో నక్సలైట్ రోల్ చేస్తున్న ఆమె, వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో ఆయన భార్య పాత్ర చేస్తున్నారు. ఇవి రెండు డీగ్లామర్ రోల్స్ కావడం విశేషం.

కాగా ఈ హీరోయిన్ తన భర్త ముస్తఫా రాజ్ ని తన మేనేజర్ గా నియమించుకున్నారట. తన సినిమాలకు సంబంధించిన డేట్స్,రెమ్యూనరేషన్స్ వంటి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకోనున్నారట. ఇక హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న మైదాన్ మూవీలో ప్రియమణి నటిస్తున్నారు. అలాగే సక్సెస్ ఫుల్ హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో కూడా ఆమె నటిస్తుంది.

Exit mobile version