సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు హాట్స్టార్లో విడుదల కానుంది. ఈ సంధర్భంగా ఆమె ఓ ఎమోషన్ పోస్టర్ పంచుకున్నారు ‘నిన్ను చూసినప్పుడు నాలోని ప్రతి అణువు బలపడుతుంది’ అంటూ సుశాంత్ ‘దిల్ బేచారా’ చిత్ర పోస్టర్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేగాక తన జీవితానికి సుశాంత్ హీరో అని పేర్కొన్నారు. “నువ్వు నాతోనే ఉన్నావు, నువ్వు ఏంటో నాకు తెలుసు. నేను నిన్ను, నీ ప్రేమను అనుక్షణం ఆస్వాదిస్తున్న. నువ్వు ఎప్పటికీ నా హీరో. ఇప్పుడు మాతో కలిసి ఈ సినిమా చూస్తావని తెలుసు’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనితో ఆమెకు సుశాంత్ అంటే అమితమైన ప్రేమని అర్థం అవుతుంది.
సుశాంత్ ఆత్మ హత్య వివాదంలో రియా చక్రవర్తి అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే పలుమార్లు ఆమెను పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. మరో ప్రక్క శుశాంత్ ఫ్యాన్స్ కూడా ఆమెపై అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు ఆమెను సూసైడ్ చేసుకోవాలని, లేదంటే మేమె రేప్ చేసి చంపేస్తామని బెదిరించారు.