నా చర్యలు వారి ఊహకు కూడా అందవు- వర్మ

‘వీడి చర్యలు ఊహాతీతం వర్మ…’ అజ్ఞాతవాసి సినిమాలో మురళి శర్మ చెప్పే ఓ ఫేమస్ డైలాగ్. కానీ వాస్తవంలో వర్మ చర్యలు ఊహాతీతం అనేది మనం వింటూ ఉంటాం. వర్మను మాటల్లో గెలవడం అనేది అసంభవం. ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం తనకే ఫేవర్ గా ఉంటుంది. తాజాగా వర్మ తీసిన పవర్ స్టార్ మూవీ అనేక వివాదాలకు దారి తీసింది. నిన్న వర్మ ఆఫీస్ పై పవన్ ఫాన్స్ దాడి చేయడం జరిగింది. అలాగే వర్మ జీవితాన్ని బట్టబయలు చేస్తానని పవన్ ఫాన్స్ పరాన్నజీవి మూవీ చేయడం జరిగింది.

కాగా నిన్న పరాన్నజీవి మూవీ టీజర్ విడుదల చేయడం జరిగింది. పరాన్నజీవి టీజర్ పై వర్మ రియాక్షన్ అడగగా…వోడ్కా తాగుతాను, అమ్మాయిలతో తిరుగుతాను, పోర్న్ చూస్తాను అని నేనే చెప్పాను. టీజర్ లో కూడా అదే ఉంది. నా గురించి వీరు కొత్తగా చెప్పేది ఏముంది. అసలు నేను చేసే పనులు వాళ్ళ ఊహకు కూడా అందవు. వాళ్ళు ఊహించే దానికన్నా ఘోరంగా నా చర్యలు ఉంటాయని వర్మ పరాన్నజీవి టీజర్ గురించి చెప్పారు.

Exit mobile version