పవన్ పై బండ్ల గణేష్ అలిగాడా?


పవన్ భక్తుడని చెప్పుకొనే బండ్ల గణేష్ ఆయనపై అలిగాడని కొందరు అనుకుంటున్నారు. దానికి కారణం బండ్ల గణేష్ అనారోగ్యం పాలైనప్పుడు పవన్ యోగ క్షేమాలు అడగక పోవడమే అని సమాచారం. కొద్దిరోజుల క్రితం బండ్ల గణేష్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వచ్చారు. కరోనా వైరస్ నుండి భయటపడ్డాక బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

అప్పుడు బండ్ల గణేష్ నేను అనారోగ్యం పాలైనప్పుడు పవన్ నాకు ఫోన్ చేయలేదని చెప్పారు. కాగా నేడు చిరంజీవిని ఉద్దేశిస్తూ , ఆయన మంచి మనసును పొగుడుతూ ఓ ట్వీట్ వేశారు. ఎలా ఉన్నావ్ అని చిరంజీవి బండ్ల గణేష్ ని అడిగారట. అది తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆ ట్వీట్ సారాంశం. ఆ ట్వీట్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన పరోక్షంగా పవన్ ని విమర్శించారని కొందరు అంటున్నారు.

Exit mobile version