చరణ్ రోల్ పై ఆరోజు క్లారిటీ?

ఆచార్య మూవీ మెగా అభిమానులకు చాలా ప్రత్యేకం. ఆ మూవీలో చిరంజీవి మరియు ఆయన తనయుడు చరణ్ కలిసి నటించనున్నారు. దీనిపై దర్శకుడు కొరటాల శివ మరియు చిరంజీవి లాక్ డౌన్ కి ముందు స్పష్టత ఇచ్చారు. గతంలో వీరిద్దరూ వెండితెరపై కలిసి కనిపించినా అవి కేవలం క్యామియో రోల్స్ మాత్రమే. ఆచార్య మూవీలో చరణ్ ఓ అరగంట నిడివి కలిగిన కీలక రోల్ చేయనున్నాడు. కానీ లాక్ డౌన్ వలన చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది.

దీనితో ఆచార్య మూవీలో చరణ్ నటించడం కుదరక పోవచ్చని ఒక అభిప్రాయం అభిమానులలో మొదలైంది. ఐతే ఈ విషయంపై ఆగస్టు 22 న స్పష్టత రావచ్చని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఆ రోజు చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆచార్య నుండి కీలక అప్డేట్ ఉంటుందని సమాచారం అందుతుంది. అలాగే చరణ్ రోల్ పై కూడా చిత్ర యూనిట్ వివరణ ఇస్తారని అందరూ భావిస్తున్నారు.

Exit mobile version