వైరల్ అవుతోన్న ‘సుశాంత్‌ సింగ్’‌ ఇంటి ముందు వీడియో !


బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ బలవన్మరణానికి పాల్పడిన దిగ్భ్రాంతికర సంఘటన నుండి బాలీవడ్ ఇపుడే నెమ్మదిగా కోలుకుంటుంది. అయితే ఈ రోజు ఉదయం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఇంటి ముందు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

తుఫాను తర్వాత వాతావరణంలో ప్రశాంతత ఎలా ఉంటుందో.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి ముందు కూడా ఈ ఉదయం వాతావరణం అలాగే కనిపించింది. సుశాంత్ పిలిచిన ఊపిరి ఇంకా ఆ గాలిలో ఐక్యం అవ్వకముందే.. అతని జ్ఞాపకాలను తనలో కలిపేసుకున్న ఆ ప్రదేశం ఏమి తెలియని నిర్మానుష్యమైన ప్రశాంతతలో హాయిగా సేదతీరుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఇక సుశాంత్ గత ఆరు నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సుశాంత్‌ సన్నిహితులు సైతం మానసిక ఒత్తిడితో సుశాంత్ బాధ పడుతున్న విషయాన్ని చెబుతున్నారు. ఈ దిగ్భ్రాంతికర వార్త బాలీవుడ్‌ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. సుశాంత్ కుటుంబానికి దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి .

Exit mobile version