గుండెపోటుకు గురైన నటుడు శివాజీ రాజా..!

సీనియర్ నటుడు శివాజీ రాజా అస్వస్థతకు గురయ్యారు. ఆయన నిన్న సాయంత్రం గుండెపోటుకు గురైనట్లు తెలుస్తుంది. తన నివాసంలో శివాజీ రాజా అకస్మాత్తుగా గుండె పోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపారు.

రేపు శివాజీ రాజాకు గుండె ఆపరేషన్ చేస్తారని వైద్యులు తెలిపారు. గతంలో శివాజీ రాజా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. అలాగే తన కుమారుడు విజయ్ రాజాను ‘ఏదైనా జరగొచ్చు’ అనే సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం చేశాడు.

Exit mobile version