వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న ఎన్టీఆర్


ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి నేడు తమ 9వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి కూడా బ్రేక్ పడిన నేపథ్యంలో ఆయన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వారి వివాహ దినము కూడా కలిసి రావడంతో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఈ వేడుకను తమ ఇద్దరు పిల్లలైన అభిరామ్, భార్గవ్ రామ్ లతో జరుపుకుంటున్నారు. 2011 మే 5న ఎన్టీఆర్ బంధువుల అమ్మాయి అయిన లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే 75 శాతానికి పైగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. లాక్ డౌన్ అనంతరం నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుంది.దీనితో పాటు త్రివిక్రంతో తన 30వ చిత్రం ఎన్టీఆర్ కమిట్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలో మొదలు కావాల్సివుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

Exit mobile version