హీరో నారా రోహిత్ ట్విట్టర్ ఎంట్రీ..!

హీరో నారా రోహిత్ హీరోగా ముఖాన్ని మేకప్ వేసుకొని 11ఏళ్ళు. ఆయన మొదటి చిత్రం బాణం సినిమాకు సంబంధించిన మొదటి షాట్ 2009 మే 5న తనపై తీశారట. ఆ మెమరబుల్ డే ని నారా రోహిత్ ఈ సంధర్భంగా గుర్తుచేసుకున్నారు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వేదిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం అదే ఏడాది సెప్టెంబర్ 16న విడుదలైంది. ఇక నేడు నారా రోహిత్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు.ఆ అకౌంట్ లో బాణం సినిమా కోసం తనపై చిత్రీకరించిన వర్కింగ్ స్టిల్ కి సంబందించిన ఫోటో ఆయన షేర్ చేశారు.

మొదటి చిత్రం బాణంతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న నారా రోహిత్, పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన సోలో మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ 11ఏళ్ల కెరీర్ లో నారా రోహిత్ అనేక ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు. జయాపజయాల సంగతి అటుంచితే నటుడిగా ఆయన మంచి పేరుతెచ్చుకున్నారు.

Exit mobile version