ప్రస్తుతం రాజమౌళి లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన పనులు మరియు తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారత కి సంబంధించిన కొన్ని ఐడియాస్ డెవలప్ చేసుకుంటున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా మహేష్ మూవీ తర్వాత ఆయన మహాభారత మూవీని తెరకెక్కించే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా పూర్తి కాకుండానే ఆయన మహాభారతకు సంబంధించిన ఆలోచనలు చేయడం చూస్తుంటే ఆయన రానున్న ఐదేళ్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారని అనిపిస్తుంది.
ఇక మహాభారత లో అనేక హీరోయిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించే అవకాశం కలదు. ఎన్టీఆర్ కి మహాభారత లో ఓ కీలక రోల్ ఉంటుందని రాజమౌళి చాలా కాలం క్రితమే హింట్ ఇచ్చారు. కాబట్టి మహేష్ మూవీ తరువాత మహాభారత మొదలుపెడితే అందులో ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఓ పాత్ర ఉంటుంది.