మార్కెట్ స్ట్రాటజీలో కూడా క్రేజీ హీరోనే !

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాధించుకుంటున్నాడు. సేవ చేయడంలోనూ హీరోలందరికీ భిన్నంగా ఆలోచించి సినీ ఫ్యాన్స్ లో మంచి మార్కులు కొట్టేశాడు. కరోనా సహాయార్ధం కొరకు కోట్ల రూపాయిలను విరాళంగా ఇచ్చిన హీరోలు కంటే కూడా.. కేవలం 25 లక్షలతో విజయ్ స్టార్ చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ కే ఎక్కువ పేరు వచ్చిందంటే అది కచ్చితంగా విజయ్ దేవరకొండ మార్కెట్ స్ట్రాటజీనే. మొత్తానికి మార్కెట్ స్ట్రాటజీలో కూడా క్రేజీ హీరోనే అనిపించుకుంటున్నాడు.

ఇప్పటికే హీరోగా నటిస్తూనే అటు బిజినెస్ మేన్ గానూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన బిజినెస్ ను రోజురోజుకి పెంచుకుంటూ చాల కూల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు విజయ్. తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ ను బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ప్రత్యేకత, నాణ్యత అంటూ వచ్చిన రౌడీ బ్రాండ్ యూత్ లోకి బాగానే తీసుకువెళ్లాడు. అలాగే త్వరలోని విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్ ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది. ఇక ప్రస్తుతం విజయ్, పూరి ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు.

Exit mobile version