ఎట్టకేలకు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్న టాలెంటెడ్ హీరో

మలయాళ స్టార్ నటుడు డుల్కర్ సల్మాన్ ఎట్టకేలకు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘మహానటి’ చిత్రంలో ఆయన నటన చూసిన తెలుగు ఆడియన్స్ ఆయన సోలో హీరోగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. దుల్కర్ సైతం మంచి కథ దొరికితే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తానని అన్నారు. ఇన్నాళ్ళకు ఆయన్ను మెప్పించే కథ దొరికిందట.

‘లై, పడి పడి లేచే మనసు’ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దుల్కర్ కోసం కథ రాసుకుని ఆయనకు వినిపించారట. కథ బాగుండటంతో దుల్కర్ సైతం ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. ఈ కథ పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అన్నీ కుదిరితే త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దుల్కర్ చిత్రాలు తరచూ తెలుగులోకి డబ్ అవుతుండటంతో ఆయన డైరెక్ట్ తెలుగు సినిమాకు మంచి మార్కెట్ లభించే అవకాశం ఉంది.

Exit mobile version