గతంలో తెలుగులో తరచుగా సినిమాలు చేస్తూ వచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య కొంచెం నెమ్మదించింది. గతేడాది కన్నడ, మలయాళం పరిశ్రమలపై దృష్టిపెట్టి తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన ఆమె కొద్దిగా గ్యాప్ తర్వాత స్పీడ్ పెంచింది. తెలుగులో దిల్ రాజు సోదరుడి కుమారుడు హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష డైరెక్ట్ చేస్తున్నారు.
ఇది కాకుండా ఇంకో కొత్త చిత్రానికి కూడా అనుపమ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. ఇది రెగ్యులర్ చిత్రం కాదని, హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీ అని సమాచారం. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు, రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత కొన్నాళ్ళుగా సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అనుపమ మరోసారి లైమ్ లైట్లోకి రావాలంటే ఖచ్చితంగా ఈ రెండు చిత్రాలు విజయం సాధించాల్సిందే.