యువీ బయోపిక్ లో ‘గల్లీ బాయ్’ నటుడు !

బయోపిక్స్ సీజన్ భారతీయ సినిమా రంగంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. చిత్రనిర్మాతలు ప్రసిద్ధ వ్యక్తుల యొక్క కథలతో బయోపిక్‌ లను నిర్మిస్తున్నారు. కాగా తాజాగా యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా రాబోతుంది. రాబోయే తరాల్లో పుట్టుకొచ్చే క్రికెట్ అభిమానులకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు ‘యువరాజ్ సింగ్’ది. 2007 T20 వరల్డ్ కప్ అలాగే 2011 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది అనే కంటే.. ‘యువరాజ్ సింగ్’ గెలిపించాడు అనడం కరెక్టేమో. యువీ రిటైర్మెంట్ బాధ కలిగించే అంశమే. భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించిన ఓ గొప్ప క్రికెటర్ టీంలో స్థానం కోల్పోయి.. కెరీర్ ను ముగించడం క్రికెట్ ప్రేమికులకు ఏ మాత్రం రుచించడం లేదు. యువీ కెరీర్ లో ఎన్నో నాటకీయ కోణాలు చోటు చేసుకున్నాయి.

తిరుగులేని క్రికెటర్ గా కొనసాగుతున్న టైంలో క్యాన్సర్ వ్యాధి భారిన పడటం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత అభిమానుల కలలు కన్న ప్రపంచ కప్ ను సాధించ పెట్టడం, తన సహచర ఆటగాడైన దోనీ తనను జట్టులో నుండి తొలిగించి అవమానించడం.. వంటి ఎత్తుపల్లాలను చూశాడు యువీ. బహుశా ఇంత డ్రామా ఏ క్రికెటర్ లైఫ్ లో జరిగి ఉండకపోవచ్చు. ఒక సినిమాకి కావాల్సినంత డ్రామా ఉన్న ‘యువీ’ లైఫ్ ఆధారంగా బయోపిక్ వస్తే.. అభిమానులతో పాటు భవిష్యత్తు క్రికెటర్ లకు కూడా ఆ చిత్రం ప్రేరణగా నిలుస్తోంది. మరి త్వరలోనే యువీ బయోపిక్ రానుంది.

ఇటీవల జరిగిన మీడియా సంభాషణలో యువరాజ్ సింగ్ తన జీవిత కథను వెండితెరపై తీసుకువచ్చే ప్రణాళికల గురించి సానుకూలంగా స్పందిస్తూ.. తన కథలో తనలా నటించడానికి సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. అయితే గల్లీ బాయ్ ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది తన బయోపిక్ లో తన పాత్రను పోషించాలని కోరుకుంటున్నానని యువి చెప్పాడు. ఈ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని కూడా చెప్పుకొచ్చాడు.

Exit mobile version