ఆ రాష్ట్రాలకు సమీప థియేటర్స్ బంద్ చేసిన తమిళనాడు

కరోనా వైరస్ కారణంగా మరో స్టేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు గవర్నమెంట్ తమ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న జిల్లాలలో థియేటర్స్, మాల్స్ మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సమీపంగా ఉన్న ప్రదేశాలలోని థియేటర్స్ అలాగే మాల్స్ మూసివేయాలని చెప్పడం జరిగింది. అలాగే తమిళ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలు చేయొద్దని సలహా ఇవ్వడం జరిగింది.

ఇక దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా వైరస్ కారణంగా హడలిపోతున్నాయి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాదిపదికన చర్యలు చేపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే తెలంగాణా మార్చి 31వరకు విద్యా సంస్థలు, సినిమా హాల్స్, మాల్స్ మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version