కోవిడ్-19: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూసివేయబడనున్న థియేటర్లు

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, పాఠశాలల్ని మార్చి 31 వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం నిర్వహించిన హైలెవెల్ కమిటీ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకొని, సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలనీ కోరారు.

Exit mobile version