ప్రభాస్‌ది కూడా చిరు ఛాయిసే

ప్రభాస్ తాజా చిత్రం కూడా పాన్ ఇండియా లెవల్లో ఉండనున్న సంగతి తెలిసిందే. చిత్రాన్ని సాంకేతికంగా ఉన్నతంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే సంగీతం అందించే భాద్యతను ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి అప్పగించనున్నారట. అనేక బాలీవుడ్ చిత్రాలకు మంచి సంగీతం అందించిన త్రివేది తెలుగులో చిరు చేసిన ‘సైరా’కు మ్యూజిక్ చేశారు.

ఆయనిచ్చిన ఔట్ పుట్ తెలుగు ప్రేక్షకుల్ని బాగానే మెప్పించింది. అందుకే రెండు పరిశ్రమలను ఆకట్టుకోవడానికి అమిత్ త్రివేదినే చూజ్ చేసుకున్నారట. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరు అందిస్తారనే విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో యూరప్లో కొత్త షెడ్యూల్ జరుపుకోనుంది. ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

Exit mobile version