గత ఏడాది నాని నటించిన జెర్సీ మూవీ విమర్శకుల ప్రశంశలు అందుకోవడంతో పాటు మంచి హిట్ అందుకుంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా ఐపోయారు. కాగా ఈ సినిమా హిందీలో అదే టైటిల్ తో రీమేక్ అవుతుంది. అక్కడ షాహిద్ కపూర్ జెర్సీ లో హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ లో షాహిద్ కి బాల్ తగలడంతో గాయం అయ్యింది. దీనితో కొద్దిరోజులు ఆయన షూటింగ్ నుండి విరామం తీసుకున్నారు.
కాగా జెర్సీ మూవీ క్రికెట్ ప్రధానంగా తెరకెక్క నేపథ్యంలో షాహిద్ క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. సాహిద్ కి శిక్షణ కొరకు ఏకంగా హిట్ మాన్ రోహిత్ రంగంలోకి దిగాడట. రోహిత్ శర్మ షాహిద్ కి బ్యాటింగ్ లో శిక్షణ ఇస్తున్నాడని తెలుస్తుంది. ఇక హిందీలో కూడా ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రాన్ని అక్కడ దిల్ రాజు నిర్మించడం విశేషం.