పొలిటికల్ పార్టీ గురించి రేపు కీలక ప్రకటన చేయనున్న రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన పొలిటికల్ పార్టీ నిర్మాణాన్ని కూడా నడిపిస్తున్నారు. ఇప్పటికే వ్యక్తిగత సిబ్బందితో తమిళనాడు వ్యాప్తంగా పార్టీ వ్యవస్థాగత నిర్మాణ పనుల్ని ఒక కొలిక్కి తెచ్చిన ఆయన ఇక ఆలస్యం చేయకుండా పార్టీపై ప్రకటన చేయడానికి సిద్దమయ్యారు. రేపు 12వ తేదీన ఆయన పార్టీని ఎప్పుడు లాంఛ్ చేసేది చెబుతారట.

వీలైనంత వరకు తమిళ కొత్త సంవత్సర దినోత్సవం అయిన ఏప్రిల్ 14వ తేదీన పార్టీని అధికారికంగా లాంఛ్ చేసే అవకాశాలున్నాయి. దీంతో ఎన్నాళ్ళగానో రజనీ నుండి పార్టీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఇతర రాజకీయ వర్గాలన్నీ కూడా రజనీ తన పార్టీ విధి విధానాలను ఎలా రూపొందించారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. ఇకపోతే సూపర్ స్టార్ ప్రస్తుతం శివ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకానుంది.

Exit mobile version