పవన్ పాట పాడే ఛాన్సుందా ?

పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు గాయకుడిగా తన టాలెంట్ చూపిస్తుంటారు. సినిమాలో ఏదైనా సంధర్భంలో జానపద గీతానికి చోటు ఉంటే వెంటనే మైక్ అందుకుంటుంటారు ఆయన. అలా ఆయన పాడిన పాటలు కొన్ని మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఆయన పాటల ప్రస్తావన తెరపైకి వచ్చింది.

మొదటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’ రీమేక్ చేస్తున్న ఆయన క్రిష్ డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఇది కంప్లీట్ పిరీయాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రం. ఇందులో జానపద గేయాలకు ఫుల్ స్కోప్ ఉంది. దీంతో ఈసారి పవన్ పాట పాడే అవకాశముందనే మాటలు వినబడుతున్నాయి. అన్నీ కుదిరి ఇదే జరిగితే పవన్ అభిమానులకు పండుగనే అనాలి.

Exit mobile version