రష్మికతో మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్

పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘గీతా గోవిందం’ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన సంగతే. ఈ చిత్రం అంతటి విజయాన్ని సాధించడానికి గల ముఖ్య కారణాల్లో హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఒకరు. ఆమె పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంది. అందుకే పరశురామ్ మరోసారి ఆమెతో వర్క్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కినేని నాగ చైతన్య హీరోగా కొత్త చిత్రాన్ని కమిటయ్యారు.

ఈ చిత్రం కూడా పరశురామ్ గత సినిమాల తరహాలోనే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉండనుంది. ఈ చిత్రంలో చైతన్యకు జోడీగా రష్మిక అయితే బాగుంటుందని ఆమెనే కథానాయకిగా ఎంచుకున్నారట పరశురామ్. మరి ఈ చిత్రం కూడా ‘గీతా గోవిందం’ తరహాలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగ చైతన్య చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తికాగానే ఈ చిత్రం మొదలుకానుంది.

Exit mobile version