నాగ చైతన్యలోని కొత్త టాలెంట్ చూడబోతున్నారట

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలో నడిచే రియలిస్టిక్ స్టోరీలా ఉండనుంది. కథలో రియాలిటీ కోసం సెట్స్ వేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. తమ కలల్ని నిజం చేసుకోవడానికి సిటీకి వచ్చిన ఇద్దరు యువతీయువకులు ఎలా ప్రేమలో పడ్డారనేదే కథట.

ఈ కథలో మరొక కీలక అంశం డ్యాన్స్. చిత్రం డ్యాన్స్ చుట్టూనే తిరుగుతుందట. అంటే చైతూ, సాయి పల్లవిలు ఇందులో డ్యాన్సర్లుగా కనిపించనున్నారు. చైతూ గత చిత్రాల్లో డ్యాన్సులు ఉన్నా పూర్తిగా వాటి మీదే నడిచే చిత్రం ఇదే కావడం విశేషం. సో.. ఈసారి చైతూలోని డ్యాన్స్ స్కిల్స్ ఈసారి పూర్తిస్థాయిలో బయటపడతాయన్నమాట. ఇకపోతే ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version