డమరుకం సినిమా వాయిదా పడడంతో ఒక్క రోజులో రిలీజ్ ప్లాన్ చేసి విడుదలైన ‘ఎ’ రేటెడ్ యూత్ సినిమా బస్ స్టాప్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. దీపావళి సెలవుల సమయం వేరే తెలుగు సినిమాలు కూడా లేకపోవడంతో ఈ సినిమా కోసం యూత్ ఎగబడుతున్నారు. వారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఓపెనింగ్స్ బావున్నాయి. నిర్మాత వ్యూహాత్మకంగా శనివారం రోజు హైదరబాద్, వైజాగ్ లోని మల్టిప్లెక్స్ థియేటర్లలో విడుదల చేయడంతో మౌత్ టాక్ కూడా బాగా ప్లస్ అయింది. నైజాం ఏరియాలో 100 థియేటర్లలో విడుదలవగా హైదరబాదులో 41 థియేటర్లలో విడుదలైన బస్ స్టాప్ కి అంతటా కలెక్షన్స్ బావున్నాయని ప్రొడక్షన్ టీం మెంబర్ ఒకరి సమాచారం. కేవలం 2 కోట్లతో తీసిన ఈ సినిమా నిర్మాతకి లాభాల పంట పండించనుంది.