ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇదే ప్రశ్నని ఈ పవర్ స్టార్ ని అడిగితే పుస్తకాలే నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నాడు. పవన్ దగ్గర చాల పుస్తకాల కలెక్షన్ ఉందని చాలా మందికి తెలియదు. పవన్ పుస్తకాల పురుగని కూడా చాల మందికి తెలియదు. వాటిలో ఫిక్షన్, హిస్టరీ లాంటి అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. పవన్ ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్ ఇచ్చిన పుస్తకాన్ని చదివే పనిలో పడ్డాడు. పవన్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించనున్నాడు. ఈ సినిమాకి హరే రామ హరే కృష్ణ అనే టైటిల్ కూడా అనుకున్నట్లు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జల్సా ఎంత క్రేజ్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది.