ప్రముఖ దర్శకుడు కొడిరామకృష్ణ బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. డా డి జే రెడ్డి బృందం ఈ సర్జరీని నిర్వహించారు. కోడిరామకృష్ణ స్వల్ప గుండె నొప్పితో చెన్నైలో హాస్పిటల్ లో చేరారు. పరిశ్రమ పెద్దలు అయన ఆరోగ్య స్థితి గురించి కనుక్కుంటూ వచ్చారు. ఎమోషనల్ మరియు డివోషనల్ చిత్రాలకు కోడిరామకృష్ణ పెట్టింది పేరు అయన దర్శకత్వంలో వచ్చిన “అమ్మోరు” మరియు “అరుందతి” భారీ విజయం సాదించిన చిత్రాలు. ఈ దర్శకుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.