కింగ్ నాగార్జున గ్రాఫిక్ మాయాజాలం “డమరుకం” ఎట్టకేలకు నవంబర్ 10న విడుదలకు సిద్దమయ్యింది ఆ విషయాన్నీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు ఆర్ధిక సమస్యల నుండి బయటపడిన ఈ చిత్రం అన్ని దాటుకొని విడుదల అవుతుంది అని నిర్మాతలు తెలిపారు. నాగార్జున మరియు అనుష్కలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ చిత్రం నాగార్జున మరియు చిత్ర బృందానికి విజయం అందించాలని కోరుకుందాం