యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’లో తెలివితేటలు కలిగిన డేర్ మరియు డాషింగ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ‘ మా బాద్షా చాలా తెలివైన వాడు మరియు అతనితో ఎవరన్నా యుద్దానికి సిద్దపడితే అది కూడా ఏక పక్షమే అయిపోతుంది’ అని ఆయన అన్నారు ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే హీరో హీరోయిన్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2013 సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.