
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పుట్టినరోజుని ముంబైలో షూటింగ్లో జరుపుకున్నారు. సేల్కాన్ సంస్థ కోసం విరాట్ కోహ్లి మరియు తమన్నాల మీద ఒక యాడ్ ని చిత్రీకరించడానికి త్రివిక్రమ్ ముంబై వెళ్ళారు అక్కడ యూనిట్ సభ్యులతో కలిసి పుట్టినరోజుని జరుపుకున్నారు. త్రివిక్రమ్ త్వరలో పవన్ కళ్యాణ్ చిత్రం చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు ఈ చిత్రంలో సమంత కథానాయికగా కనిపించనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.