మరో చిత్రం శ్రీకాంత్

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ మరో చిత్రం ఒప్పుకున్నారు ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ నటుడు పుష్యమి ఫిలిం మేకర్స్ అనే నూతన సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వారం ప్రారంభం కానుంది డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ సింగల్ సిట్టింగ్లో ఓ కే చేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి త్వరలో వెల్లడిస్తారు.

Exit mobile version