దళం ఫస్ట్ లుక్ విడుదల

నవీన్ చంద్ర మరియు పియా బాజ్పాయ్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “దళం” ఫస్ట్ లుక్ విడుదల చేశారు. “అందాల రాక్షసి” చిత్రంతో పరిచయం అయిన నవీన్ చంద్రకి ఇది రెండవ చిత్రం ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అయిన జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్లో విడుదలకు ఈ చిత్రం సిద్దమవుతుంది జేమ్స్ వసంతన్ సంగీతం అందించగా సుమన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అయిన జీవన్ రెడ్డి అయన నుండి స్ఫూర్తి పొందినట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లలో ఈ ఛాయలు కనిపిస్తాయి. మీరేం అంటారు ఫ్రెండ్స్? మీకు పోస్టర్స్ నచ్చాయా? మీ ఉద్దేశాన్ని కామెంట్స్లో తెలుపండి.

Exit mobile version