ఈ రోజు నలుగురు సౌత్ ఇండియా సెలెబ్రిటీస్ పుట్టిన రోజు


నవంబర్ 7 సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు సౌత్ ఇండియాలో ఉన్న నలుగురు సెలబ్రిటీల పుట్టినరోజు. ఒకరు లోకనాయకుడు కమల్ హాసన్ గారైతే, మరొకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్వీటీ అనుష్క శెట్టి, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా నవంబర్ 7 న పుట్టారు. కమల్ హాసన్ గారు 1954 నవంబర్ 7న పరంకుడిలో జన్మించారు. కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్ప్పవలసిన అవసరం లేదు. అయన విశ్వ విఖ్యాత నటుడు. త్రివిక్రమ్ 1972 నవంబర్ 7న భీమవరంలో జన్మించారు. మొదట్లో మాటల రచయితగా ఇండస్ట్రీకి వచ్చి నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారి ప్రస్తుతం తెలుగులో అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. స్వీటీ అనుష్క కర్ణాటక లోని మంగ్లూరులో జన్మించింది. సూపర్ సినిమాతో పరిచయమై అరుంధతి సినిమాతో టాప్ హీరొయిన్ గ ఎదిగింది. ఇక వెంకట్ ప్రభు విషయానికి వస్తే 1975లో పుట్టాడు. అతని సినిమాలకు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. సరోజ, గ్యాంబ్లర్ వంటి సినిమాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.

వీరందిరికీ 123తెలుగు.కాం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Exit mobile version