డా. డి. రామా నాయుడు మూడవ తరం వారసుడిగా టాలీవుడ్లో అరంగేట్రం చేసిన యంగ్ హంక్ రానా బి.టెక్ బాబు పాత్రలో సురభి నాటక కళాకారుడుగా రానున్న చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సురభి నాటక కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ మన దేశంలో ఇప్పుడున్న అన్ని నాటక సంస్థల కంటే సురభి నాటక గ్రూప్ వారు ముందు స్థానంలో ఉన్నారు. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మన తెలుగులో వచ్చిన ‘భక్త ప్రహల్లాద’ సినిమా ద్వారా పరిచయమైన మొదటి టాలీవుడ్ హీరోయిన్ కమలా భాయి కూడా ఒక సురభి నాటక కళాకారిణి కావడం విశేషం’ అని అన్నారు. నయనతార జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఔదిఒకి మంచి రెస్పాన్స్ వచ్చింది.