రవితేజ మరో మాస్ మసాలా సాంగ్


మాస్ మహారాజ రవితేజ తన డైలాగ్ డెలివరీ మరియు కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న ‘సార్ ఒస్తారా’ సినిమా కోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక మార్కెట్ యార్డ్ సెట్లో మాస్ మసాలా పాటను చిత్రీకరిస్తున్నారు. సందడిగా ఉండే మార్కెట్ షాపుల మధ్య మరియు మార్కెట్లో జరిగే అందమైన సన్నివేశాలు కూడా ఈ పాటలో చోటు చేసుకున్నాయి.

కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘సోలో’ సినిమాతో హిట్ కొట్టిన పరశురాం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాతో రవితేజ కి బ్రేక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా కనిపిస్తున్న ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

Exit mobile version