ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రానున్న చిత్రం ‘సేవకుడు’. శ్రీ కాంత్ సరసన ఛార్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వి. సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ముత్తినేని సత్య నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ కాంత్ సూర్యం అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. చట్టంలోని లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని సమాజంలో అన్యాయాలు చేస్తూ ఉండేవారిని సూర్యం శిక్షిస్తూ ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ మరియు ఆయన కుమార్తె మంజుల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న క్రైమ్, కోర్టులో జరిగే అన్యాయాలు, మరియు మన చట్టం వల్ల పోలీసులు ఎదురుకొంటున్న వీటన్నింటిని శ్రీ కాంత్ పరిష్కరించాలి అనుకుంటాడు. ఈ సినిమాని నవంబర్ చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.