అదే టార్గెట్ తోనే నేనూ పనిచేస్తాను – నయన్


ఇప్పటి వరకూ గ్లామరస్ మరియు నటిగా గుర్తుండిపోయే పాత్రలు చేసిన అందాల భామ నయనతార కొంత విరామం తర్వాత చేసిన సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నయన్ తెలుగు మరియు తమిళంలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉన్నారు. నయనతార ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నంబర్ వన్ గేమ్’ మీద మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగితే ఆమె సమాధానమిస్తూ ‘ నంబర్ వన్ గేమ్ అనేది లేదు అదంతా నమ్మకంలేని విషయం అని నేను చెబితే అది అబద్దం అవుతుంది. మనం ఏదైనా ఒక కెరీర్ ని ఎంచుకున్నప్పుడు అందులో సక్సెస్ అవ్వాలి మరియు నంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి అని అనుకుంటాం. అలాగే ఇక్కడ కూడా నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకోవాలనుకుంటాం. నేను కూడా అదే టార్గెట్ తోనే ఎంతో కష్టపడి పనిచేస్తానని’ ఆమె అన్నారు. ప్రస్తుతం నయనతార నాగార్జున సరసన ఒక సినిమాలో మరియు తమిళంలో అజిత్ సరసన ఒక సినిమాలో నటిస్తున్నారు.

Exit mobile version