సౌందర్య రజినీకాంత్ తన రాబోతున్న చిత్రం “కోచాడియన్” లో చిన్న విషయాలలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. “అవతార్” మరియు “టిన్ టిన్”లో ఉపయోగించిన క్యాప్చర్ టెక్నాలజీ ఈ చిత్రం కోసం ఉపయోగించారు. విజువల్ ఎఫ్ఫెక్ట్స్ మాత్రమే కాకుండా ఈ చిత్రంలో చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి అంశాల్లోకి సౌందర్య మరొక విశేషాన్ని చేర్చింది. ” “అవెంజర్స్”, “తొర్”, “టైటానిక్ 3డి” , “అవతార్” వంటి చిత్రాలకు పని చేసిన స్టీరియో డి టీంతో కలిసి “కోచాడియన్” చిత్రం కోసం పని చెయ్యడం చాలా ఆనందంగా ఉంది” అని ఆమె తెలియజేశారు. ఈసంస్థ ప్రత్యేకత ఏంటంటే 2D చిత్రాన్ని 3Dకి మార్చడంలో సిద్దహస్తులు. ఈ చిత్రంలో రజినీకాంత్, దీపిక పదుకొనే, శరత్ కుమార్, ఆది, శోభన,రుక్మిణి, జాకి ష్రాఫ్ మరియు నాజర్ లు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందిస్తుడగా ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12,2012 న విడుదల కానుంది.