శిరిడి సాయి చిత్రం కోసం పని చెయ్యడం నా అదృష్టం – నాగార్జున


తన రాబోతున్న చిత్రం “శిరిడి సాయి” చిత్రంలో భగవాన్ శిరిడి సాయి పాత్రను ధరించడం తన అదృష్టం అని అక్కినేని నాగార్జున అన్నారు. ” ఈ చిత్రంలో నటించడం చాలా గొప్ప అనుభవం. బాబా చెప్పిన చాలా విషయాలను నేర్చుకున్నాను మన చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. ప్రస్తుతం నేను ప్రశాంతంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న మనుషులతో సంతోషాన్ని పంచుకోవడం నేర్చుకున్నాను ” అని అన్నారు.ఈ చిత్రంలో నాగార్జున హావ భావాలూ మరియు లుక్ కి అన్ని వైపుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మహేష్ రెడ్డి నిర్మించారు. ఈ భక్తిరస చిత్రానికి ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.

Exit mobile version